సత్తుపల్లి తొలి మహిళ ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిచిన డాక్టర్ మట్టా రాగమయి మహిళ లోకానికి స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర జవహర్ లాల్ అన్నారు. ఆదివారం రాగమయి జన్మదినం సందర్భంగా సత్తుపల్లి మునిసిపాలిటీలోని సుమారు 55 మంది పారిశుద్ధ్య కార్మికులకు రాగమయి చేతుల మీదుగా చీరలు పెట్టి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాగమయి మాట్లాడుతూ, మానవత్వంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు.