సరళ భాషలో ఉన్న వేమన పద్యాలు సులభంగా నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. మంగళవారం స్సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆషా సంస్థ ప్రచురించిన వేమన శతక పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. సరళ భాష, విలువలు బాల్యం నుంచే నేర్పడానికి వేమన పద్యాలు ఉపయోగపడతాయని అన్నారు. పద్యాలు నేర్చుకోవడానికి వయసు అడ్డు కాదని, తాను పాతిక వేమన పద్యాలు నేర్చుకున్నానని తెలిపారు.