సత్తుపల్లి-రేజర్ల వెళ్లే రహదారిలో పైపు లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. అర్ధరాత్రి రోడ్డు అర్ధం కాకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో సింగరేణి విస్తరణ కారణంగా రోడ్డు డైవర్షన్ చేశారు. పూర్తి మలుపు ఉండటంతో డ్రైవర్లకు రూటు అర్థం కాక ఇలా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.