సత్తుపల్లి: ప్రియాంకగాంధీ విజయంపై సంబురాలు

69చూసినవారు
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించడం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. ఈమేరకు ప్రియాంక విజయంతో సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్