సత్తుపల్లి మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం విచారణ చేయించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలరాణి, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనందబాబు, కౌన్సిలర్లు కోరారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడుతూ సిమెంట్ బల్లలను రూ. 2,600 తో కొనుగోలు చేసి రూ. 6,300 చొప్పున బిల్లులు కాజేశారని, లవ్ సత్తుపల్లి, అంబేడ్కర్ విగ్రహం, వందడుగుల జాతీయ జెండా ఏర్పాటులోనూ అవినీతి జరిగిందని విమర్శించారు.