కల్లూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. యువకుడి సెల్ ఫోన్ కు ఇండియన్ బుల్స్ అనే యాప్ ద్వారా లోన్ పొందే సమాచారం రావడంతో లింక్ కనెక్ట్ చేసి రూ. 10 లక్షల లోన్ కోసం సంప్రదించాడు. యాప్ ద్వారా ఖర్చుల నిమిత్తం రూ. 50, 927 ఇప్పటి వరకు చెల్లించాడు. యాప్ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.