ఖమ్మంలో విశ్వహిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం

82చూసినవారు
ఖమ్మంలో విశ్వహిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం
ముడుపు రెడ్డి తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి.
ఖమ్మంలో విశ్వహిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనంలో శ్రీ ముడిపుడి యాదిరెడ్డి విశ్వహిందూ పరిషత్ సంఘటన మంత్రి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీ బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ దేశ మాన బిందువు కాపాడడంలో కీలకపాత్ర వహిస్తుంది. జనవరి 24 , 2022 నుండి ఈ దేశం రామరాజ్యంలోకి వచ్చినట్లు ఈ సందర్భముగా VHP ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో గ్రామ సమితి, సత్సంగం ,భజన ప్రతి దేవాలయంలో ధార్మిక కార్యక్రమాలు, ఉదృతం చేస్తాము అన్నారు . వందల గ్రామాల నుండి 2000 మంది పైగా వచ్చారని రాబోయే రోజులలో ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ వేలాదిగా జాయిన్ అవ్వాలని వారు తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్నవారు బజరంగ్దళ్ రాష్ట్ర కో కన్వీనర్ వెంకట్ , విభాగ్ కార్యదర్శి బాలాజీ, జిల్లా అధ్యక్షుడు బోనాలు రామకృష్ణ, జిల్లా కార్యదర్శి బొడ్డు కృష్ణ, వెంకటేశ్వర్లు, జిల్లా కార్య అధ్యక్షులు శ్రీనివాసరావు గారు సామాజిక కార్యకర్త వినోద రావు గారు, బజరంగ్దళ్ జిల్లా కొత్తపల్లి బ్రహ్మ తేజ, కృష్ణమోహన్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్