ఆకేరు వాగులో గల్లంతై కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మృతి చెందిన విషయం విదితమే. వీరి పేరిట రూ. 5లక్షల చొప్పున మంజూరైన రూ. 10లక్షల చెక్కును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ముజమ్మిలాఖాన్, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కలిసి అందజేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్డీఓ గణేష్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.