దసరా పండుగ పురస్కరించుకుని ఆర్టీసీకి బాగా కలిసి వస్తుంది. ఏ బస్సు చూసినా కిక్కిరిస్తుంది. పండుగ సెలవులు రావడంతో ప్రతి ఒక్కరూ కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు, సొంత ఊరికి, మహిళలు అమ్మగారి ఇళ్లకు పోతుండటంతో బస్సులు నిండిపోతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావడంతో చిన్న వస్తువులు కొనాలన్నా బస్సెక్కి ఖమ్మం వస్తున్నారు. దీనికి తోడు హైదరాబాద్ సర్వీసులు పెంచడంతో గ్రామాలకు బస్సు సర్వీసులు తగ్గిపోయాయి.