ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు శనివారం ఆందోళనకు దిగారు. గేట్లు మూసివేసి నాలుగు గంటల పాటు ధర్నా చేశారు. గార్లఒడ్డు గ్రామానికి చెందిన నరేష్ ఓ వ్యాపారికి మార్కెట్లో పత్తి విక్రయించాడు. రెండు చోట్ల కాంటా వద్ద తూకం వేయిస్తే 20 కేజీల తేడా వచ్చింది. దీంతో ఆగ్రహించిన నరేష్ ధర్నాకు దిగారు. మార్కెట్లో వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని ఆరోపించారు.