రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. వైరా సీఎం బహిరంగ సభను జయప్రదం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైరా రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మకమని శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుందన్నారు.