పత్తి సాగు చేస్తున్న రైతులు సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే మంచి దిగుబడులు సాధించొచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై క్షేత్ర దినోత్సం, వర్క్ షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి రైతులు హాజరయ్యారు. పరిశోధకులు మాట్లాడుతూ అధిక సాంద్రత పద్దతిలో పత్తి సాగు వల్ల లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.