AP: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం ప్రారంభమైంది. ఈ పిడకల సమరాన్ని తిలకించేందుకు ఇతర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. కాళిదేవి, వీరభద్రస్వామి ప్రేమ వ్యవహారం సందర్భంగా ఏటా ఆచారంగా ఈ పిడకల సమరం నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు పిడకలు విసురుకుని భక్తిని చాటుకుంటారు.