రహదారిపై గుంతలు పూడ్చివేయాలని నాటేస్తూ మహిళల నిరసన

85చూసినవారు
రహదారిపై గుంతలు పూడ్చివేయాలని నాటేస్తూ మహిళల నిరసన
కామేపల్లి మండలం ముచ్చర్ల బీసీ కాలనీ వద్ద ప్రధాన రహదారిపై భారీగా ఏర్పడిన గుంతలు చిన్నపాటి చెరువును తలపిస్తుంది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారిపై నెలలు గడుస్తున్నా ఆర్అండ్ బి శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ మరమ్మతులు చేపట్టకపోవడంతో స్థానిక మహిళలు శుక్రవారం రహదారిపై నాటేస్తూ నిరసన తెలిపారు. బత్తుల శాంతమ్మ, బత్తుల సంధ్య, చింతల నారమ్మ, చల్లా ఉపేంద్ర, మన్నెమ్మ, స్రవంతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్