ఉత్తర కొరియాను వరదలు ముంచెత్తాయి. దీంతో దేశవ్యాప్తంగా ఐదు వేల మంది వరకు నిరాశ్రయులయ్యారు. 4 వేల మంది వరకు చనిపోయారు. దేశంలోని వరద ప్రభావిత ప్రాంతాలను దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యటించాడు. వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని దానికి బాధ్యులను చేస్తూ 30 మంది ఉన్నతాధికారులకు ఉరిశిక్ష విధించి గత నెలాఖరులోనే అమలు చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.