కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ & ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ మేజిస్ట్రేట్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతిస్తున్నావు? అని మేజిస్ట్రేట్ నిందితుడిని ప్రశ్నించగా అతడు భావోద్వేగానికి గురయ్యాడు. 'నేను ఏ నేరం చేయలేదు. నన్ను ఇందులో ఇరికిస్తున్నారు. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుంది' అని అతడు చెప్పాడు.