సాంకేతిక విప్లవానికి నాంది పలికిన రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని *లింగాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు: జాధవ్ రమేష్* అన్నారు. శనివారం రాజీవ్ గాంధీ 78వ జయంతిని స్థానిక లింగాపూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు మాట్లాడుతూ. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రూపకల్పన దిద్దిన మహనీయుడు నేడు సెల్ ఫోన్ వినియోగం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది అంటే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కృషి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. అతి చిన్న వయసు 40 సంవత్సరాలు ప్రధానిగా దేశానికి కి సేవలందించారని ఆయనను *ఫాదర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ* అని పిలుస్తున్నారని తెలిపారు. ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీ కే దక్కుతుందని అన్నారు. రైల్వే టికెట్లను ఆన్లైన్ బుకింగ్ ప్రవేశపెట్టిన ఘనత మరియు ప్రతి గ్రామానికి టెలిఫోన్ బూతు అందుబాటులోకి తెచ్చి పెద్ద పీట వేసిన ఘనత రాజీవ్ గాంధీ జవహర్ లాల్ నెహ్రూ నవోదయ పాఠశాలను ప్రారంభించి గ్రామీణ విద్యార్థులకు ఉచిత విద్యను అందించారని అధ్యక్షులు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో *రాథోడ్ కిరణ్ నాయక్, చవాన్ సునీల్, జాటోత్ దవిత్ కుమార్ (లింగాపూర్ మండలం సోషల్ మీడియా కన్వీనర్), నాగర్గోజే కిషోర్, విశ్వతి, జాధవ్ విలాష్, రాథోడ్ దేవరావు మహారాజ్, జాధవ్ రామ్, రాథోడ్ అంబాజీ, ఆడే భంగి & కాంగ్రెస్ పార్టీ శ్రేణులు* తదితరులు పాల్గొన్నారు.