గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

10232చూసినవారు
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గెడం లక్ష్మణ్ ఇంట్లో శ్రీరామనవమిని పురస్కరించుకొని పూజ చేసి దీపం వెలిగించారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పెలినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.

సంబంధిత పోస్ట్