ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాస్ రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో డివిజన్ పరిధిలో టీఎస్ డబ్ల్యూఆర్జెసి రెబ్బెన మండల్ లో షీటీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీం ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలపై హింస, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ లకు ఎవరైనా గురి అయినట్లయితే వెంటనే షీటీం ను సంప్రదించాలని సూచించారు.