ఆసిఫాబాద్: జర్నలిస్ట్ సురేష్ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టీయూడబ్ల్యూజే ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. ఇటీవల మృతి చెందిన జర్నలిస్టు వడ్లూరి సురేష్ కుటుంబానికి సోమవారం పట్టణంలోని వైయస్సార్ కాలనీలో ఆయన నివాసంలో రెండు నెలలకు సరిపడే నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.