రెహమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు అందజేత

264చూసినవారు
రెహమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు అందజేత
ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండల కేంద్రంలోని కేరళ గ్రామర్ స్కూల్లో విద్యార్థిని, విద్యార్థులకు గురువారం రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవకులు ఉచితంగా పుస్తకాలను అందించడం జరిగింది. ఈ పుస్తకాలను రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని సహకారంతో వారు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవకులు మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఉన్న నిరుపేద విద్యార్థులందరికీ రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తమవంతు ఈ పుస్తకాల పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే విధంగా పాఠశాల సిబ్బంది వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ అధ్యక్షులు ఆడ అమృత్ రావ్, జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనక గంగారాం, పాఠశాల ప్రిన్సిపాల్ అఖిల్, జైనూర్ మండలం కోఆప్షన్ సభ్యులు ఆఫ్రోజ్ ఖాన్, సామాజిక సేవ కార్యకర్త ఆత్రం రవీందర్, గెడం దినేశ్, హైదర్, సతీష్, శ్రీకాంత్* తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్