రెబ్బెన మండలం బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని సీఈఆర్ క్లబ్లో శుక్రవారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు శిబిరం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ కు చెందిన మాతా రీసెర్చ్ సెంటర్ వైద్యుడు విశ్వనాథ మహర్షి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.