కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివ్యాంగులకు అందించే త్రిచక్ర వాహనాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్నారు. వాహనాల జాబితా తయారీలో ఓ స్వచ్ఛంద సంస్థలోని ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారని తెలిపారు. త్రిచక్ర వాహనాలు అనర్హులకు అందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.