పెరిగిన సివిల్ సప్లై హమాలిరేట్ల జీఓను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయుసి ఆధ్వర్యంలో హమాలి కార్మికులు బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలి రేట్లు క్వింటాల్ కు రూ. 26/-నుంచి రూ. 35/-లకు పెంచాలని, 350కిలోల బెల్స్ బండల్ కు ఒకటికి ఎగుమతి, దిగుమతి రూ. 200లకు పెంచాలన్నారు.