ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని అదనపు కలెక్టర్‌కి వినతి

85చూసినవారు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని అదనపు కలెక్టర్‌కి వినతి
డీఎస్సీ నియామకాల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వలన బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ యువ జన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ అన్నారు. సోమవారం ఫిర్యాదులు విభాగంలో కొమరంభీం జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ ద్వారా బిసి బిడ్డలు ఎంతో మంది ఉద్యోగ నియామకాలకు దూరం కావాల్సిన పరిస్థితి దాపురించిందని కావున తక్షణమే ఉద్యోగ నియామకాల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్