ఆసిఫాబాద్ నియోజకవర్గం లింగాపూర్ మండలం రాము నాయక్ తండా గ్రామ వాస్తవ్యులు నిరుపేద గిరిజన మహిళా రాథోడ్ ఝాలి బాయి గత కొద్దిరోజుల క్రితం మరణించి0ది. మాతృమూర్తి ఝాలిబాయి గారి పెద్దకర్మకు రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్: షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని సహకారంతో ఆదివారం పెద్దల సమక్షంలో కుమారుడు గణేష్, కూతురు సత్తికా లకు 5000/- రూపాయలు నగదు అందించి నిరుపేద కుటుంబానికి ఆదర్శంగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బాధిత కుటుంబానికి సభ్యులకూ ఆర్థిక సహాయం చేశామన్నారు. ప్రతి సామాన్యుడి కష్టాల్లో రెహమాన్ ఫౌండేషన్ తోడుగా నిలుస్తుందని తెలిపారు. ఝాలిబాయి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబానికి రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము నాయక్, కిషన్, రామారావు, మంగు మహారాజ్, దత్త, ఫిరోజ్ తదితరులు ఉన్నారు.