రెహమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దకర్మ కు నిత్యావసర సరకులు అందజేత

475చూసినవారు
రెహమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దకర్మ కు నిత్యావసర సరకులు అందజేత
ఆసిఫాబాద్ నియోజకవర్గం లింగాపూర్ మండలానికి చెందిన నిరుపేద రైతు చవాన్ రామారావు (46) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆకస్మికంగా మరణించారు. ఈ సందర్బంగా లింగాపూర్ మండలం రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవకులు చవాన్ రామారావు పెద్దకర్మ కార్యానికి చేయూతగా మంగళవారం 100 కేజీల బియ్యం, 15 లీటర్ల మంచి నూనె, 500 విస్తారులు, 500 గ్లాసులు, 10 కిలోల కందిపప్పు సరకులను చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని సహకారంతో వారి కుటుంబ సభ్యులకు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. రెహమాన్ ఫౌండేషన్ తరపున వారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మనోధైర్యానిచ్చారు. బాధిత కుటుంబానికి కొంతైనా భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నిత్యావసర సరకులను అందించామన్నారు. భవిష్యత్తులో కూడా రెహమాన్ ఫౌండేషన్ వారి కుటుంబానికి అండగా ఉంటుందని సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెహమాన్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జాధవ్ విలాష్, రాథోడ్ సంతోష్, జాటోత్ నాందేవ్, జాధవ్ ప్రవీణ్ కుమార్, చవాన్ శ్రీనివాస్, చవాన్ శివా తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్