తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కుల గణన సర్వే పరిశీలించాలని డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు, మండల అధ్యక్షులు నారాయణ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు మండోకర్ అనిల్ గురువారం పరిశీలించారు. ఈ సర్వే వల్ల ప్రజలకే మేలు జరుగుతుందని, ఆ మేలును ప్రజలంతా ఉపయోగించుకోవాలని అనిల్ వివరించారు. ఈ కార్యక్రమంలో సోమ, బిక్కు, తదితరులు పాల్గొన్నారు.