బెజ్జుర్: జ్వరంతో యువకుడు మృతి
బెజ్జూర్ మండలం ఎలుక పెళ్లిబి గ్రామానికి చెందిన వద్గురి అంజన్న (18) అనే యువకుడు జ్వరంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ కాగజ్నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.