ఘనంగా మొహర్రం వేడుకలు…

66చూసినవారు
ఘనంగా మొహర్రం వేడుకలు…
కాగజ్‌నగర్‌ మండలం బారేగూడ గ్రామంలో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం పీరీలను దర్శించుకోవడానికి పలు గ్రామాల నుండి, పక్క రాష్టాల నుండి వేల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు పుట్టు వెంట్రుకలు తీసి, షర్బత్, మలిదాలు నైవేద్యంగా సమర్పించుకున్నారు. కులమతాలకు అతీతంగా డప్పు చప్పులతో ఆట పాటల నడుమ పీరీలను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవార వినోద్, మల్లేష్, నందయ్య, మెంగాజీ, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్