ఇటీవల కాలంలో కొందరు పరాయి వారి మోజులో పడి.. జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నారు. అంతేకాక వారి సంసారాన్ని కూల్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ మహిళ తన భర్త పరాయి స్త్రీతో స్కూటీ పై షికారు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం ఆమె తన పిల్లలకు తండ్రి చేసే ఘనకార్యాన్ని కళ్ళారా చూపెట్టింది. కానీ సదరు భర్త ఆమెను లెక్కచేయలేదు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.