చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ మార్కెట్లో గురువారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు పాల్గొని మాట్లాడారు. 420 హామీలు ఇచ్చి దొడ్డి దారిన గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఛతికిలపడ్డదని దీనిని 420 సర్కార్ అని పిలవవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, బీజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.