కాగజ్నగర్ మండలం దరిగాం కు సరైన రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడుగడుగునా గుంతలు ఏర్పడి నడవలేని పరుస్థితి, బైకులు కూడా నడపలేని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో రోగులను, వృద్దులను గర్భిణులను ఆసుపత్రికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరిగాం యూత్ సభ్యులు కలిసి శనివారం ట్రాక్టర్లతో మొరం వేయించి గుంతలను పూడ్చారు. దాదాపుగా 3 కిలోమీటర్ల మేర మొరం వేయించినట్లు వారు తెలిపారు.