బెజ్జురు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణ స్థలం కురిసిన వర్షపు నీటితో నిండింది. దీనిని చెరువు అనుకుంటే పొరపాటే. కార్యాలయంలోనికి వెళ్లాలంటే ఆవరణలో నీరు నిలిచిన నీటితో కాళ్లు, వీలైతే స్థానం కూడా చేసి ఒళ్ళంతా తడుపుకొని వెళ్లాల్సిందే అని స్థానికులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయ ఆవరణలో నిలిచిన నీరుని పారద్రోలాలని కోరుతున్నారు.