రజాకార్లతో పోరాటం చేసిన యోద్దురాలు, శతాధిక వృద్ధురాలు జలగం రాధమ్మను కోదాడలోని తన నివాసంలో మంగళవారం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సన్మానించారు. ఈ సందర్భంగా ఆ సమయంలో రజాకారులతో ఆమె చేసిన పోరాట వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అప్పుడు రజాకార్లు చేసిన అరాచకాలను, అఘాయిత్యాలను, వారిపై పోరాటాలను ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు ఉన్నారు.