సిర్పూర్ నియోజకవర్గంలో శనివారం కౌటాల మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వారికి స్థానిక ఎన్నికలలో అనుసరించవలసిన తీరు, ప్రజా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌటాల మండలం మాజీ ఎంపీపీ బసర్కర్ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.