నెన్నెల మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు లేక గ్రామంలోని పలు వార్డులు అంధకారంలోనే ఉన్నాయి. వర్షాకాలం కావడంతో రాత్రి సమయంలో ప్రజలు బయటికి రావాలంటే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరారు.