మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని గంధపు చెక్కల వ్యాపారి అంటూ బీఆర్‌ఎస్ నేత అగౌరవంగా మాట్లాడడాన్ని మంత్రి కొండా సురేఖ ఖండించారు. కోమటిరెడ్డి సోదరుల గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదని, తెలంగాణ కోసమే కోమటిరెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్ లాగా ప్రతీకార రాజకీయాలకు పాల్పడదని ఆమె ఉద్ఘాటించారు.