ఆర్చ‌రీలో ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు

61చూసినవారు
ఆర్చ‌రీలో ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు
ఒలింపిక్స్‌ తొలిరోజే ప్రపంచ రికార్డు బద్ధలైంది. ఆర్చరీ ర్యాంకింగ్స్‌ రౌండ్‌లో దక్షిణ కొరియా యువకెరటం లిమ్‌ సిహైయన్‌(21) చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో గురువారం జరిగిన పోటీల్లో లిమ్‌ 694 పాయింట్లు సాధించింది. దాంతో, 2019లో దక్షిణ కొరియాకే చెందిన కాంగ్‌ చీయంగ్‌(692 పాయింట్లు) నెలకొల్పిన రికార్డును ఈ టీనేజర్‌ బద్ధలు కొట్టేసింది. వరల్డ్‌ నంబర్‌ 2 అయిన లిమ్‌ సిహైయన్‌ ఈ సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్