భూసార పరిరక్షణ అనేది మనందరి బాధ్యత అని, భూసార పరిరక్షణతోనే పది కాలాల పాటు సుస్థిరమైన దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన శాస్త్రవేత్త, ఇన్ఛార్జి ఏడీ ఐవిఎస్ రెడ్డి అన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ప్రపంచ మృత్తిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ వనరులు అయిన నేల, నీరు సంరక్షణతోనే మనిషి మనుగడ సుభిక్షంగా ఉంటుందని అన్నారు.