చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలి.

58చూసినవారు
చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలి.
వెంకమ్మ చెరువు కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు 2013 చట్ట ప్రకారం ఎకరాకు రూ. 8 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని భూనిర్వాసిత రైతులు నీటి పారుదల శాఖ ఈఈ సురేష్ కుమార్ ను వేడుకున్నారు. అశ్వారావుపేట మండలంలోని మల్లాయిగూడెంలో శనివారం ఆయన భూనిర్వాసితులతో సమావేశమయ్యారు. 2013 చట్ట ప్రకారం రూ. 3 లక్షలు చెల్లిస్తేనే పరిహారం తీసుకుంటామని రైతులు తెల్చి చెప్పారు. ఈ సమావేశంలో డీఈ కృష్ణ, ఏఈ, రైతులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :