ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల

66చూసినవారు
అశ్వారావుపేట నియోజకవర్గంలోని స్థానిక వ్యవసాయ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని కలెక్టర్ అన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల మెటీరియల్ అందించామని, వీరంతా పోలీస్ సెక్యూరిటీతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని అన్నారు.

సంబంధిత పోస్ట్