భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, జగన్నాథపురం సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్టు ట్రాన్స్కో ఏఈ లక్ష్మీనర్సింహారావు తెలిపారు. సబ్ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.