ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టుని మంత్రుల సమక్షంలో ఆయన ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ముగ్గురు మంత్రులు కష్టపడుతున్నారని తెలిపారు.