క్రీడా ప్రాంగణం నుండి అక్రమంగా మట్టిని తరలించారు

75చూసినవారు
క్రీడా ప్రాంగణం నుండి అక్రమంగా మట్టిని తరలించారు
అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలో ఉన్న స్మశాన వాటిక పక్కన గల క్రీడా ప్రాంగణంలో వ్యాయామ పరికరాలను తొలగించి జెసిబి సాయంతో మట్టిని తరలిస్తున్నారని గురువారం స్థానికులు ఆరోపించారు. క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన ప్రదేశంలో మట్టిని తరలించడం సరికాదన్నారు. వెంటనే రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి విచారణ జరిపి మట్టి అక్రమ రవాణా చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్