ఏడీఈకు రెండు ఉత్తమ సేవా అవార్డులు

82చూసినవారు
ఏడీఈకు రెండు ఉత్తమ సేవా అవార్డులు
అశ్వారావుపేట ట్రాన్స్కో ఏడీఈ బి. వెంకటేశ్వర్లుకు ఒకేసారి రెండు ఉత్తమ అవార్డులు దక్కాయి. గురువారం సీఎండీ వరుణ్ రెడ్డి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఇంజనీర్ అవార్డును, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు అందించారు. పెదవాగు ప్రాజెక్టుకు గండిపడి, భారీగా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఒకరోజులోనే వీటిని పునరుద్ధరించి మెరుగైన సేవలు అందించినందుకుగాను ఏడీఈ అవార్డులు అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్