అశ్వారావుపేటలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశానికి స్వతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహోన్నత వ్యక్తులను స్వతంత్ర దినోత్సవం నాడు స్మరించుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. వారిచే మనకు అందించిన స్వేచ్చ నిజంగా విలువైందిగా మలుచుకోవాలని సూచించారు. దేశాన్ని అగ్రగామిగా మార్చేందుకు యువత సంకల్పంతో పని చేయాలన్నారు.