చర్ల సరిహద్దు ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ అణిచివేతలో భాగంగా మావోయిస్టుల ఇలాకాలో బుధవారం భద్రతా బలగాలు ఎఫ్వోబీల (ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్) ఏర్పాటును వేగంగా చేపడుతున్నాయి. బీజాపూర్ జిల్లా పామేడు పోలీసుస్టేషన్ పరిధిలోని జీడిపల్లిలో మరో ఎఫ్ఎబీని భద్రతా బలగాలు బుధవారం ఏర్పాటు చేశాయి. దీంతో పాటు ధర్మారం నుంచి జీడిపల్లి వరకు రహదారి నిర్మాణ పనులను ఆరంభించారు.