భద్రాచలం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని ట్రెండ్ యూనియన్ జాతీయ నాయకులు బొమ్మెర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని ఎస్సీ కులాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని గురువారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ఎస్సీ కులాలను గిరిజనేతరులుగా అభియోగ మోపి అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని, ఇలా చేయడం సరి కాదని పేర్కొన్నారు.