విభజనతో ఏపీలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తున్నామని మహబూబాబాద్ ఎంపీ బలరామ్నాయక్ అన్నారు. గురువారం ఆయన రామయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం ప్రాంత అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి కరకట్ట నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం, ఐదు పంచాయతీలలో ఏపీ ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.